ఆమదాలవలస ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందే
● కల్తీ మద్యం సొమ్ములతో టీడీపీ నాయకుల జల్సాలు
● విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపాటు
ఆమదాలవలస: కల్తీ మద్యం కేసులో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆమదాలవలస వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడా రు. తమ నియోజకవర్గంలో ఇసుక, భూములతో అక్రమంగా ఆర్జిస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు కల్తీ మద్యం అమ్మకాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఆయన అనుచరులే నియోజకవర్గంలో సు మారు 16 వైన్‌షాప్‌లు దక్కించుకున్నారని తెలిపారు. 16 మద్యం దుకాణాల పరిధిలో వందల సంఖ్యలో బెల్టుషాపులు నడిపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల సరుబుజ్జ్జిలిలో కల్తీ మద్యంతో పట్టుపడిన వైన్‌షాప్ యజమాని పైడి ముఖలింగం (అలియాస్ నూకరాజు) కూనకు అత్యంత ఆదాయాన్ని చ్చే అనుచరుడని తెలిపారు. ఆ దుకాణంలో జరుగుతున్న కల్తీ మద్యం కేసును ఆ యజమానిపైకి రాకుండా అందులో పనిచేసే సిబ్బందితో చీకటి ఒప్పందాలు చేసుకొని అరెస్ట్ చేయించడం దారుణమని, కూన రవి పేరు బయటకు రాకుండా ఉండేందుకే ఇలా చేశారని ఆరోపించారు. కూన రవికుమార్ పాత్ర పూర్తిగా ఉందని సమగ్రమైన దర్యాప్తును ఉన్నతాధికారులు చేయాలని డిమాండ్ చేశారు.
కల్తీ మద్యం సొమ్ముతో జల్సాలు
కల్తీ మద్యం సొమ్ములతో ఇటీవల ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రస్తుతం పట్టుపడిన వైన్స్ షాప్ యజమాని పైడి ముఖలింగం(అలియాస్ నూకరాజు) మరికొంతమంది గోవాలోని ట్రిప్ కి వెళ్లారని రవికుమార్ వెల్లడించారు. అక్కడ వారు చేసిన నిర్వాకాలను ఫొటోలతో సహా చూపించారు. వారు విలాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. కూనకు పూర్తి అనుచరుడు అయిన షా ప్ యజమాని అటు మంత్రి అచ్చెనాయుడుకూ సన్నిహితుడిగా మెలుగుతున్నాడని చెప్పారు. వారి ఫొటోలను కూడా చూపించారు. వీరందరిపై విచారణ జరిపి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, పార్టీ వివిధ విభాగాల ముఖ్య కార్యవర్గ సభ్యులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సరుబుజ్జ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, పార్టీ నాయకులు రామ్మోహన్‌రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


