వణుకుతున్న తాళ్లవలస
● గ్రామంలో ప్రబలుతున్న డయేరియా
సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా ప్రబలుతోంది. ఊరిలో 800 మంది జనాభా ఉన్నారు. పారిశుద్ధ్య లోపం, తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా వ్యాప్తి చెందిందని స్థానికులు చెబుతున్నారు. సమీప పొలాల్లోని బావి వద్ద నుంచి మోటార్లతో గ్రామంలోని ఇళ్ల వద్దకు పైపులైన్లు ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఆ నీటిని తాగి ఆదివారం గ్రామంలో చాలా మంది వాంతులు, విరేచనాలతో టెక్కలి జిల్లా ఆస్ప త్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మార్పు చిన్నారావు(65)అనే వ్యక్తి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గున్మ రుద్రమ్మ, సీపాన కొండయ్య చికిత్స పొందుతుండగా గున్న పాపారవు, చల్ల రాములు మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారు.
కారణాలివేనా..?
● గ్రామానికి సంబంధించి ఇంటింటికీ కుళాయి ఉ న్నప్పటికీ కుళాయిలకు తాగునీరు వచ్చే బోరు మా త్రం గ్రామం శివారులోని పంట పొలాల్లో ఉంది.
● ప్రస్తుతానికి పంటల సీజన్ కావడంతో పొలాలకు వాడే ఎరువులు, క్రిమిసంహారక మందులు ఆ నీటిలో కలుస్తున్నాయనే అనుమానం ఉంది.
● ఊరిలోనూ పారిశుద్ధ్య పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి.
● మురుగునీటి కాలువల్లో పూడికలు తీయలేదు. పారిశుద్ధ్య కార్మికులు వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారు.
● ఓ వ్యక్తి చనిపోయాడని తెలిశాక వైద్య సిబ్బంది వచ్చారు. ముందస్త జాగ్రత్త చర్యలేవీ చేపట్టలేదు.
టెక్కలి రూరల్ (సంతబొమ్మాళి)


