శివ శివా..
● శ్రీముఖలింగంలో దుర్గంధం
● సెప్టిక్ ట్యాంక్ పగిలి వ్యర్థాలు బయటకు వస్తున్న వైనం
త్వరలో బాగు చేస్తాం
విషయం మా దృష్టికి వచ్చింది. సెప్టిక్ ట్యాంక్ నూతనంగా నిర్మాణం చేయడానికి టెండర్‌లు పిలిచాం. త్వరలో పనులు చేసి సమస్య పరిష్కరిస్తాం.
– కె.మూర్తి, కన్జర్వేటివ్ అసిస్టెంట్
నానా అవస్థలు
ఎంతో పవిత్ర దేవాలయం శ్రీముఖలింగం. ఇదే నెలలో ఇక్కడకు రెండు సార్లు వచ్చాం. సీ్త్రలు, చిన్నపిల్లలతో మరుగుదొడ్లు లేక నానా అవస్థలు పడ్డాం.
– అప్పల నాయడు, బెజ్జిపురం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం దేవాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ పరమ అధ్వానంగా కనిపిస్తోంది. మరుగుదొడ్లు సెప్టిక్ ట్యాంక్ పగిలి వ్యర్థాలు బయటకు రావడంతో దుర్గంధం వెదజల్లుతోంది. క్షేత్రానికి రోజూ వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొంత మంది భక్తులు స్వామి సన్నిధిలో రోజంతా గడుపుతారు. ఇదే సమయంలో చాలా వరకూ మరుగుదొడ్లు వినియోగిస్తారు. ఈ దుర్గంధం వల్ల వారంతా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
శివ శివా..


