పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలి
బూర్జ: థర్మల్ విద్యుత్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు తక్షణమే రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, మండల గిరిజన ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో గల అన్నంపేట పంచాయతీ తిమడాం గ్రామంలో ఆదివారం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవరసింహాచలం, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ, ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సవర లక్ష్మణరావు, సవర సింగయ్య, సవర భూగన్న, సవర మనోజ్, సవర తోటయ్య, కల్లేపల్లి సూర్యనారాయణ, కల్లేపల్లి మోహనరావు, సతివాడ బాలరాజు, కల్లేపల్లి దుర్గారావు, కల్లేపల్లి రమణ, పలువురు ఆదివాసీలు, తదితర్లు పాల్గొన్నారు.


