ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్‌ బృందానికి కోచ్‌, మేనేజర్లుగా సిక్కోలు వాసులు | - | Sakshi
Sakshi News home page

ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్‌ బృందానికి కోచ్‌, మేనేజర్లుగా సిక్కోలు వాసులు

Nov 30 2025 6:45 AM | Updated on Nov 30 2025 6:45 AM

ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్‌ బృందానికి కోచ్‌, మేనేజర్లుగా స

ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్‌ బృందానికి కోచ్‌, మేనేజర్లుగా స

ఏపీ రాష్ట్ర అథ్లెటిక్స్‌ బృందానికి కోచ్‌, మేనేజర్లుగా సిక్కోలు వాసులు ● రికార్డు స్థాయిలో నలుగురు నియామకం రాజీపడదగ్గ కేసులు పరిష్కరించాలి : ఎస్పీ

శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14 బాలబాలికల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు కోచ్‌, మేనేజర్లుగా శ్రీకాకుళం వాసులకు అరుదైన అవకాశం ల భించింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌ వేదికగా డిసెంబర్‌ ఒకటి నుంచి 4 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలబాలికల బృందానికి కోచ్‌, మేనేజర్లగా జిల్లాకు చెందిన నలుగురు వ్యా యామ ఉపాధ్యాయులు(ఎస్‌ఏపీఈ) నియా మకమయ్యారు. నియామకమైన వారిలో బాడాన నారాయణరావు (పీడీ–జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చాకిపల్లి, టెక్కలి మండలం), నడిమింటి నాగరాజు (పీడీ–జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల యామలపేట, సంతబొ మ్మాళి మండలం), పీరుకట్ల సునీత (పీడీ– జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బ్రాహ్మణతర్ల, పల్సా మండలం), సయ్యద్‌ సౌజన్‌ (జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం) ఉన్నారు. వీరు నలుగురు ఈ పోటీ ల కోసం శనివారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్కూల్‌గేమ్స్‌ అథ్లెటి క్స్‌ అండర్‌–14 బాలబాలికల బృందంతో కలిసి ఇండోర్‌ చేరుకోనున్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబరు 13న జాతీయ లోక్‌ అదాలత్‌ జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కుటుంబ, ఆస్తి వివాదాలు, చిన్న క్రిమినల్‌, ట్రాఫిక్‌, కాంపౌండ్‌ కేసుల వంటి రాజీ సాధ్యమైనవి ముందుగా గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా సున్నితమైన, అతి సున్నితమైన గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, సమాచారాన్ని సిద్ధం చేయాలని, జనాభా వివరాలు, కమ్యూనిటీ ప్రదేశాలు, ముఖ్య ప్రాంతాలు, గొడవలు జరిగే ప్రాంతాలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్‌ వివేకానంద, డి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

పోలీసులకు కళ్లద్దాల పంపిణీ

శ్రీకాకుళం క్రైమ్‌ : సిబ్బంది కంటి ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి యాంటీ–గ్లేర్‌ కళ్లద్దాలను పంపిణీ చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్‌ కానిస్టేబుళ్లు, ఐటీకోర్‌, డీసీఆర్బీ, కార్యాలయ సిబ్బందికి వందకు పైగా కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, ఏఓ గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement