సభ్యుల సూచనలకు విలువనిచ్చి పనిచేయండి
అరసవల్లి: జెడ్పీటీసీ సభ్యుల సూచనలకు విలువ ఇవ్వాలని, ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకోవద్దని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు పలువురు ముఖ్య కమిటీల సభ్యులు హాజరు కాగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ విజయ మాట్లాడుతూ క్షేత్ర సా యిలో స్థానిక సంస్థల పాలకుల సూచనలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, స్పందించని అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూన రవి మాట్లాడుతూ గతంలో పనిచేసిన చాలావరకు పనులకు బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టారని, ముఖ్యంగా ఉపాధిహామీ పనులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 2012లో రూ.9 లక్షల బిల్లులు ఇప్పటివరకు రాకపోతే ఆ కాంట్రాక్టర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 6,3,5 స్థాయీ సంఘాలు వాయిదా పడినట్లుగా అఽధికారులు ప్రకటించారు. మిగిలిన స్థాయీ సంఘాల సమావేశాలకు జెడ్పీ చైర్‌పర్సన్ విజయ అధ్యక్షత వహించి పూర్తి చేశారు. కార్యక్రమంలో పలువురు శాఖాఽధికారులు పాల్గొన్నారు.


