జగనన్న కాలనీలపై వివక్ష ఎందుకు..?
నరసన్నపేట: జగనన్న కాలనీల్లో నివసిస్తున్న ప్రజలపై ప్రభుత్వం ఇంత వివక్ష చూపడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూ టీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ము పంచాయతీ పరిధిలోని గడ్డెయ్యపేట వద్ద జగనన్న కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడాని కి శనివారం వెళ్లిన కృష్ణదాస్‌కు కాలనీ వాసులు తమ సమస్యలు వివరించారు. మంచి నీరు రావ డం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కాలనీ వాసులు మరణిస్తే దహనం చేసుకోవడానికి స్థలం లేదని తెలిపారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై కృష్ణదాస్ స్పందిస్తూ ప్రభుత్వ తీరును తప్పబట్టారు. జగనన్న కాలనీలో నివసిస్తు న్న వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


