క్యూబిటెక్‌తో ఆదిత్య కళాశాల ఎంవోయూ
టెక్కలి:
హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ సొల్యూషన్ సంస్థ క్యూబిటెక్‌తో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా క్యూబిటెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పృథ్వీ పిన్నాకతో కలిసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆధునిక పరిశోధన, స్మార్ట్ సొల్యూషన్ అభివృద్ధి రంగాల్లో విద్యా పరిశ్రమల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికే ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు వెల్లడించారు. అనంతరం సంస్థ సహ వ్యవస్థాపకుడు పృథ్వీ పిన్నాక మాట్లాడుతూ.. క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ టెక్నాలజీలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, అలాగే పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధి సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సాంకేతిక వర్క్‌షాప్‌లు, అధ్యాపకులకు ఎఫ్‌డీపీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ అవకాశాల విస్తరణ, ఆధునిక సిమ్యులేటర్లు, పరిశోధనా ప్రయోగశాలల సదుపాయాల వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఈ ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఏ.ఎస్.శ్రీనివాసరావు, అసోసియేట్ డీన్ బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


