గ్రామీణ ప్రాంతాల్లో బరితెగింపు
జిల్లాలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లోనే కల్తీ మద్యం దందా నడుస్తోంది. పల్లెల్లో అంత గుర్తించే అవకాశం ఉండదనే ఉద్దేశంతో అక్రమార్కులు కూడా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. షాపుల్లోను, అద్దె ఇళ్లల్లోనే కల్తీ డెన్‌లు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా బెల్ట్‌షాపులకు కల్తీ మద్యాన్ని పంపిస్తున్నారు. కంపెనీల నుంచి వచ్చిన బాటిల్స్‌ను అధునాతన పరికరాలతో తెరిచి, కల్తీ చేసి, సీల్ చేసేస్తున్నారు. ఒకవైపు కౌంటర్‌లో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేపడుతుండగా, మరోవైపు పర్మిట్, బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. ఇంకా చాలడం లేదంటూ మద్యం కల్తీకి బరితెగిస్తున్నారు.


