రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి

Nov 29 2025 6:53 AM | Updated on Nov 29 2025 6:53 AM

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి

కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి

రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ వేగుళ్ల జోగేశ్వరరావు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ వేగుళ్ల జోగేశ్వరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ అంచనాల కమిటీ శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో గతంలో కలసి ఉన్న జిల్లా, ప్రస్తుత జిల్లా అధికారులతో 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై సమీక్షించింది. కలెక్టర్‌ ఖర్చుల వివరాలు వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు ఈ ఆర్థిక సంవత్సరాల్లో పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను శాసన మండలి సభ్యులు డాక్టర్‌ వీవీ సూర్యనారాయణ రాజు పెనుమత్స అడగ్గా డీడీ ఆ వివరాలు అందజేశారు.

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి బాలికల వసతి గృహాలపై ఆరా తీశారు. బాలికల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ చెప్పగా ప్రతి విద్యార్థి ప్రొ ఫైల్‌ ఉందని, రిజిస్టర్‌లో అన్నీ నమోదు చేస్తున్నామ ని డీడీ తెలిపారు. కమిటీ చైర్మన్‌ వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ కలెక్టర్‌ సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నాయ్‌ దొర జిల్లాలో ఉన్న గిరిజన హాస్టళ్ల గురించి వివరించారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ హాస్టళ్లలో మరుగుదొడ్లపై ప్రశ్నించారు. డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో అమలు చేస్తున్న పథకాలను వివరించా రు. కొత్త విధానంలో ఎన్ని గ్రూపులు రుణాలు పొందాయని కమిటీ చైర్మన్‌ జోగేశ్వరరావు అడగ్గా 12 వందల కోట్లు ఇచ్చినట్లు పీడీ చెప్పారు. పింఛన్లు కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయా అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడుగగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పీడీ వివరించారు. వన్‌స్టాప్‌ సెంటర్లపై కూడా వరుదు కల్యాణి ప్రశ్నించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మాట్లాడుతూ జలజీవన్‌ మిషన్‌ కింద పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గంలో కొన్ని పనులు రద్దు జరిగిందని, రద్దు అయిన పనుల పునరుద్ధరణకు కమిటీ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పలాస కిడ్నీ ఆస్పత్రిపైనా వరుదు కల్యాణి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్‌ నష్టం జిల్లాలో ఎంత జరిగిందని కమిటీ సభ్యులు వరుదు కల్యాణి అడుగగా 1627 హెక్టార్లని జేడీ చెప్పారు. ఎంత మంది రైతులు ఇన్సూరెన్సు చేయించారని అడుగగా 55,634 మందికి చేయించినట్లు వ్యవసాయ శాఖ జేడీ చెప్పారు.

సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, జిల్లా పరిషత్‌ సీఈఓ సత్యనారాయణ, సీపీఓ లక్ష్మీ ప్రసన్న, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కృష్ణమూర్తి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌, మత్స్య శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, పీఆర్‌ ఎస్‌ఈ వీరన్నాయుడు, కమిటీతో పాటు రాష్ట్ర శాసన సభ డిప్యూటీ సెక్రటరీ కె.రాజా కుమార్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ వి.బిక్షం, సెక్షన్‌ ఆఫీసర్‌ టి. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement