పది మందికి జరిమానా | - | Sakshi
Sakshi News home page

పది మందికి జరిమానా

Nov 29 2025 6:53 AM | Updated on Nov 29 2025 6:53 AM

పది మ

పది మందికి జరిమానా

పది మందికి జరిమానా

నందిగాం: మద్యం తాగి వాహనం నడిపి నందిగాం మండల పరిధిలో పట్టుబడిన పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున టెక్కలి కోర్టు జరిమానా విధించిందని ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారిపై సెక్షన్‌ 185 మెటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి శుక్రవారం టెక్కలి జేఎంఎఫ్‌సీ కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.పదివేలు జరిమానా లేదా 10 రోజులు జైలు శిక్ష అని జడ్జి తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ తెలిపారు.

రైతును నట్టేట ముంచుతున్నారు

● ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మండిపాటు

నరసన్నపేట: బాబు సర్కారు అన్ని రకాలుగా రైతులను నష్టపరుస్తోందని, పంటను సకాలంలో కొనుగోలు చేయకుండా దగాకు పాల్పడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పండిన ధా న్యం అమ్ముకోవడానికి అనేక ఆంక్షలు పెడుతోందన్నారు. చంద్రబాబు నిజస్వరూపం చూ పుతున్నారని అన్నారు. టమాటా, ఉల్లి, అరటి, మిరప పంటలకు మద్దతు ధర కల్పించలేక పోయిన ప్రభుత్వం ఇప్పుడు వరి ధాన్యం అ మ్మకాల వద్దకు వచ్చే సరికి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సక్రమంగా ధాన్యం కొనుగో లు చేయక దళారులకు అమ్ముకొనే విధంగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కొనుగో లు కేంద్రాల ఏర్పాటు, ఏజెన్సీల నియామకంలో కూడా రాజకీయం చేస్తూ రైతులకు కష్టాలకు గురి చేస్తుందన్నారు. రైతులకు నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చని అంటూ కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులను పట్టించుకోవడం లేదని, షెడ్యూల్‌ ఇవ్వడం లేదని, ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వ మని అన్నారు. గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారని, రైతులు బయట కొనుగోలు చేసి నష్టపోతున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో, ధాన్యం నాణ్యత పేరుతో దళారులు రైతులను మోసం చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకు వస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు ఆదుకోవాలని, ధాన్యం అమ్మకాల విషయంలో పూర్తిగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల పక్షాన ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. స మావేశంలో నరసన్నపేట, పోలాకి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

అరసవల్లి రథసప్తమి ఇక ‘సప్తాహ సూర్య పర్వం’

కేంద్ర మంత్రి కింజరాపు

రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌ తదితరులు శుక్రవారం కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడు రోజుల పాటు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకోసం ప్రధాన అర్చకులతో సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆన్‌లైన్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఏదో ఒక రోజు ఉత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌

శ్రీకాకుళం రూరల్‌: జిల్లాలో గల స్కూల్‌, కాలేజ్‌లకు చెందిన పలు వాహనాలపై విజయవాడ రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాలు మేరకు శుక్రవారం నుంచి డిసెంబర్‌ 4వరకూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్‌ చేస్తున్నట్లు ఉపరవాణాశాఖాధికారి విజయసారధి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 41 వాహనాలను తనిఖీలు చేసి నోటీసులు అందించినట్లు తెలిపారు.

పది మందికి జరిమానా 
1
1/1

పది మందికి జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement