● మృతురాలి కుటుంబానికి చెక్ అందజేత
ఇటీవల కాశీబుగ్గ–పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కి సలాటలో తొమ్మిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మృతుల కుటుంబానికి రూ.రెండు లక్షలు చొప్పున సహాయం అందజేశారు. అందులో భాగంగా సంఘటనలో మృతి చెందిన ఒడిశా రాష్ట్రం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప ఉరఫ్ జ్యోతి కుటుంబానికి సైతం ఆర్థిక సాయం అందించేందుకు వైఎస్సార్ సీపీ ముందుకు వచ్చింది. ఒడిశాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మృతురాలి తండ్రి ఢిల్లేశుకు శుక్రవారం రెండు లక్షల రూపాయల చెక్‌ను అందజేసింది. దీంతో ఒడిశా వాసులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సహాయానికి మురిసిపోయారు. చెక్ అందించిన వారి జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప, ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ వై.మోహనరావు, కంచిటి జెట్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, లొద్దపుట్టి ఎంపీటీసీ సభ్యులు పిట్ట హేమలత, ఆశి మంథాకిని, కొఠారీ సర్పంచ్ దుక్క ధనలక్ష్మీ, శ్రీరామ్‌రెడ్డి, ఒడిశా గ్రామ పెద్దలు మద్ది భోజరాజు, పంది రఘుమోహనరావు, రోకళ్ల ధర్మరాజు, కె.పరుశురాం తదితరులు పాల్గొన్నారు. –ఇచ్ఛాపురం రూరల్


