టెక్కలి డివిజన్‌కు నందిగాం
● అభ్యంతరాలుంటే తెలపాలి : కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం, నందిగాం మండలాన్ని ప్రస్తుతం ఉన్న పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్‌కు మారుస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రాథమిక నోటిఫికేషన్ (జీవోఆర్టీ.1490) జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే, గెజిట్ ప్రచురణ అయిన తేదీ (27.11.2025) నుంచి 30 రోజుల్లోపు రాతపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన కంబకాయ యువకుడు
నరసన్నపేట: కంబకాయకు చెందిన పాగోటి సతీష్ అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌లోని పటాయ్ పట్టణంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీ ల్లో సత్తా చాటి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ యునైటెడ్ వరల్డ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్(యూడబ్ల్యూఎస్‌ఎఫ్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఆసియా స్థాయి లో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన పోటీలో సతీష్ ప్రతిభ చూపి మూడో స్థానంలో నిలిచారు. సుమారు 20 దేశాల నుంచి 18 మంది పోటీల్లో పాల్గొనగా తనకు కాంస్య పతకం దక్కిందని ఆయన తెలిపారు. దీనిపై సర్పంచ్ పాగోటి కుసుమ కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరి సతీష్‌కు అభినందనలు తెలిపారు.
బాడీ
బిల్డింగ్
పోటీల్లో
సాధించిన
కాంస్య పతకంతో సతీష్


