‘తోటపల్లి కాలువ, ఉప కాలువలు ఆధునికీకరించాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: తోటపల్లి కాలువ, ఉపకాలువలను ఆధునికీకరించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుకు కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, రైతులు, ఆయకట్టుదారులు రాబో యే సాగు కాలంలో పనులు పూర్తవుతాయని ఆశతో ఉన్నారని, శివారు భూములకు నీరు అందేలా పనులు చేయించాలని కోరారు. 2026 సీజన్‌లో మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.


