10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
శ్రీకాకుళం: జిల్లాలో గల అన్ని యా జమాన్యాల పాఠశాలలకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించడానికి డిసెంబర్ 6 వరకు గడువు ఉందని, రూ.50లు ఆలస్య రుసుంతో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు, రూ.200లు రుసుంతో డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు, రూ.500లు అపరాధ రుసుంతో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు చెల్లించాలని, ప్రధానోపాధ్యాయులు వెబ్ సైట్‌లో తమ స్కూల్ లాగిన్‌లో విద్యార్థి వివరాలు ధ్రువీకరణ చేసి, ఫీజు చెల్లించాలని డీఈఓ తెలిపారు.


