ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా, అథ్లెటిక్స్ ఫెడ రేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా అస్మిత అథ్లెటిక్స్ లీగ్–2025 పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు శుక్రవారం ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగాయి. అండర్–14, 16 విభాగాల్లో మాత్రమే బాలికలకు ఈ పోటీలను నిర్వహించా రు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులకు పత కాలు, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతకుముందు జరిగిన ఈపోటీల ప్రారంబోత్సవ సమావేశంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అథ్లెటిక్స్‌లో యువ టాలెంట్‌ను గుర్తించేందుకు కేంద్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పేరిట పోటీల ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతిభావంతులను గుర్తించి తదుపరి పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో పి. సుందరరావు, ఏపీ అథ్లెటిక్స్ టెక్నికల్ కమిటీ చైర్మన్ కె.హరి బాబు, కె.మాధవరావు, పరిశీలకులు జమీల్, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, శ్రీనివాసరావు, మురళి, ఆనంద్, పురుషోత్తం, పీడీలు, పీఈటీలు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు


