రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కవిటి : ఆర్.కరాపాడు టోల్‌గేట్ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచారామ్ (28) అనే వ్యక్తి మృతిచెందాడు. కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. హైవేపై ఉన్న రాజస్థాన్ డాబాలో పంచారామ్ వంట మనిషిగా పని చేస్తున్నాడు. పని పూర్తయ్యాక రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో నడుచుకుంటూ వస్తుండగా భారీ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన పంచారామ్‌ను ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్సులో తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ నుంచి జారిపడి మహిళకు గాయాలు
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండల కేంద్రం సమీపంలోని శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం బెలమాం గ్రామానికి చెంది న బెండు సూర్యకుమారి గాయాలపాలయ్యా రు. ఈమ తన సోదరుడు కర్రి సత్తిరెడ్డి ద్విచక్ర వాహనంపై పొందూరు నుంచి బెలమాం వెళ్తుండగా ఎచ్చెర సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బండి నుంచి కిందకు జారిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. తల వెనుకభాగంలో గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
నందిగాం: బడగాంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న రైతు బమ్మిడి వైకుంఠరావు(49) గురువారం మృతి చెందాడు. గత నెల 22న పొలంలో పనిచేస్తుండగా వైకుంఠరావుకు నాగుపాము కా టు వేసింది. గ్రామస్తులు 108 ద్వారా టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కో సం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నిరుపేద కావడంతో వైకుంఠరావుకు వైద్య చికిత్స నిమిత్తం గ్రామస్తులు రూ.లక్ష సేకరించి ఆర్ధిక సాయం చేశారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వైకుంఠరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.


