ప్రభుత్వ విద్య, వైద్యంపై యువకుడి వినూత్న నిరసన
కొత్తూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్న విద్య, వైద్య రంగాల అమలు తీరుకు నిరసనగా కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన యువకుడు పొన్నాడ హేమసుందరరావు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రజలు చెల్లించిన డబ్బుతో నడుస్తున్న ప్రభుత్వ బడుల్లో ఎమ్మెల్యేలు, మంత్రు లు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను చదివించినప్పు డే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్యం పొందితేనే అందరికీ నాణ్యమైన వైద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే పర్య వేక్షణ లోపిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రైవేటీ కరణ చేయడం వల్ల పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యం అందకుండాపోతుందన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ప్రతి రోజూ ఒక గంట పాటు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు.


