బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అంటరానితనం, అసమానతలు వంటి వాటిని రూపుమాపి బీసీల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల లక్ష్మణరావు అన్నారు. మహిళలకు సమాన హక్కులు, విద్య కావాలని, సమాజంలో తారతమ్యాలను పారదోలేందుకు కృషి చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు నివాస గృహంలో శుక్రవారం నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పైడి రామకృష్ణారావు, పూజారి నిత్యానందం, హనుమంతు రామారావు, మెండ సింహాచలం, కెల్లి వెంకటేష్, తిర్లంగి లోకనాధం, మెట్ట దివాకర్, బాడాన ఈశ్వరరావు, పొన్నాడ సత్యం,బిర్లంగి రామ్మోహన్, దుంపల గోవిందరావు పాల్గొన్నారు.


