30 మందికి డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు
అరసవల్లి: గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మండల జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారులుగా జిల్లాలో 30 మందికి అడహక్ పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల్లో ప్రత్యేకంగా డిప్యూటీ ఎంపీడీఓ హోదాతో ఫస్ట్ లెవల్ గెజిటెడ్ ఆఫీసర్లుగా పంచాయతీరాజ్ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. ఈఓపీఆర్‌డీ పోస్టును ఇటీవలే డిప్యూటీ ఎంపీడీవోలుగా మార్పు చేసిన సంగతి విదితమే. తాజాగా అదే హోదాతో మండల జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారులుగా సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పి స్తూ కొత్త స్థానాలను కేటాయించారు. పదోన్నతలు పొందిన వారిలో మాసపు సంతోష్‌కుమా ర్ (సారవకోట), డి.అప్పన్న (పొందూరు), జి.తులసీదాస్ (శ్రీకాకుళం), కె.వి.వి.జగన్నాథరావు (గార), కె.అనూరాధ (ఎచ్చెర్ల), బి.కృష్ణారావు (పాతపట్నం), జి.వెంకటరావు (కొత్తూరు), హెచ్.ఉమాపతి (నందిగాం), ఎస్.రామ్మోహనరావు (ఆమదాలవలస), ఎం.నారాయణమ్మ (లావేరు), వి.అప్పయ్య (మెళియాపుట్టి) , పి. వి.ఎన్.మూర్తి (జలుమూరు), పల్లి ద్రాక్షాయణి (నరసన్నపేట), జి.త్రినాథరావు (టెక్కలి), ఎం.శాంతకుమారి (సోంపేట), పి.వెంకట మురళి (జి.సిగడాం), ఎల్.లక్ష్మణమూర్తి (కంచిలి), సీహెచ్.లక్ష్మణరావు (సంతబొమ్మాళి), ఎస్.ఉమాపతి (పలాస), ఎం.భాస్కరరావు (బూర్జ), జె.ఝాన్సీలక్ష్మి (రణస్థలం), టి.వి. లీలారాజు (కోటబొమ్మాళి), ఎ.మృత్యుంజయ రావు (సరుబుజ్జిలి), పి.ప్రజ్ఞ శిరీష (హిరమండలం), జి.సంధ్యారాణి (పోలాకి), జి.అప్పలనాయుడు (ఎల్‌ఎన్‌పేట), ఎం.రాజేష్ (ఇచ్ఛాపురం), బి.వి.ఎస్.రెడ్డి (కవిటి), ఎ.శ్రీనివాసరావు (వజ్రపుకొత్తూరు), ఎల్.వి.నాగకుమార్ (మందస) ఉన్నారు.


