పేదింటి యువతికి పెళ్లి కానుక
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బలరాంపురం గ్రామానికి చెందిన జ్యోతిర్మయి అనే యువతికి శ్రీకాకుళం నగరానికి చెందిన సప్తగిరి జ్యూయలర్స్ అధినేత గంగు వెంకటరావు కల్యాణ మస్తు పేరిట రెండు తులాల బంగారం, పావుకేజీ వెండి వస్తువులను గురువారం అందజేశారు. ఏడాది క్రితం శ్రీకాకుళంలోని సప్తగిరి జ్యూయలర్స్ షాపులో తీసిన లక్కీ డ్రాలో జ్యోతిర్మయి కల్యాణ మస్తు స్కీమ్‌లో ఎంపిక కావడంతో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. ప్రస్తుతం జ్యోతిర్మయికి గురువారం వివాహం కావడంతో సప్తగిరి షాపు యజమాని ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు సమక్షంలో కల్యాణమస్తు కింద ఆభరణాలు అందించారు.


