గుంతలో పడి మూగజీవి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో గురువారం పాడి ఆవు ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఒక టవర్ కోసం ప్రైవేట్ వ్యక్తులు గుంతలు తవ్వి విడిచిపెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మర్రిపాడు గ్రామానికి చెందిన పాడిౖ రెతు గూడ భాస్కరరావు జీవనాధారమైన సుమారు రూ.90 వేలు విలువ గల పాడి ఆవు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ నాయకుడు గూడ ఈశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డు పక్కన తవ్వి వదిలేసిన గుంతలను వెంటనే పూడ్చాలని కోరారు.


