ఓటర్ల జాబితా తయారు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రానున్న పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారు చేయాలని, ఆర్వో ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఓటర్ల సమ్మరీపై ఆర్వోలు, ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, క్లయిములపై ఆయన సమీక్షించారు. బూత్ స్థాయి సిబ్బంది తో సమావేశంలో నిర్వహించి, ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో, ఎస్డీసీలు తదితరులు పాల్గొన్నారు.


