వీఆర్వోలపై దుర్భాషలు
పలాస: మండలంలోని కంబిరిగాం రెవెన్యూ పరిధి లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్థలాల్లో వెంచర్లు వేస్తున్న పలాసకు చెందిన రియల్ ఎస్టేటు వ్యాపారి కోరాడ శ్రీనివాసరావుపై కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ముగ్గురు వీఆర్వోలు గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. కంబిరిగాంకు చెందిన ఒక వ్యక్తి తన పొలాలను శ్రీనివాసరావుకు విక్రయించాడు. రూ.కోట్ల విలువైన ఆ భూములను అతను కొనుగో లు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. అందులో ఎత్తుపల్లాలను చదును చేయడానికి ఆ పక్కనే ఉన్న కొండను అక్రమంగా తవ్వి అనధికారికంగా కంకరను తరలించాడు. ఈ విషయంపై మైన్స్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు ఇటీవల వచ్చి పరిశీలించారు. అనంతరం వారు సంబంధిత వ్యక్తి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారు.
నోటీసులపై వీరంగం
ఆ నోటీసులను పట్టుకొని పలాస మండలానికి చెందిన కంబిరిగాం వీఆర్వో బి.వెంకటరావు, లక్ష్మీపు రం వీఆర్వో బి.వెంకటరమణ, చినంచల వీఆర్వో చంద్రమోహన్‌లు కలిసి రియల్ ఎస్టేటు వ్యాపారి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అతను లేకపోవడంతో అతని భార్య వద్ద నుంచి అతడి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేశారు. దీంతో ఆయన ఫోన్‌లో వీఆర్వోలపై విరుచుకుపడ్డా డు. నానా దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ఆ వెంటనే పలాస తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వీరంగం చేశాడు. నోటీసులు ఇవ్వడానికి మీరెవ్వరంటూ తహసీల్దార్‌తో సైతం అమర్యాదగా మాట్లాడాడు. దీంతో తహసీల్దార్ టి.కల్యాణ చక్రవర్తి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులు అక్కడికి వెళ్లి శ్రీనివాసరావును అక్కడ నుంచి తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత వీఆర్వోల సంఘం తరుపున ఆ సంఘం నాయకు లు కొర్ల శ్రావణ్‌కుమార్, పైల సంతోష్, ఖగేశ్వరరా వు, అప్పలస్వామి, ప్రసాద్ తదితరులు స్టేషన్‌కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం రాత్రి ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. గురువారం కూ డా వెళ్లి మళ్లీ పోలీసులను కలిశారు. అప్పటికే స్టేషన్‌లో ఉన్న కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి వారికి సమాధానం చెబుతూ.. సీఐ ప్రస్తుతం లేరని పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.


