రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
ఆమదాలవలస: రైతుల కోసం మాట్లాడే అర్హత టీడీ పీకి లేదని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రస్తు తం చేస్తున్న రైతన్న కోసం కార్యక్రమం బూటకమ ని అన్నారు. అది రైతులను మోసం చేయడానికేనని మండిపడ్డారు. ఏడాదికి రూ.20,000లు రైతు భరో సా ఇస్తానని చెప్పి.. ఈ రెండు సీజన్లకు రూ. 40,000లు ఇవ్వాల్సింది పోయి, రూ.5,000లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతుల ను నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలులో ఎన్ని అక్రమాలు, వివక్షలు చూపుతారోనని రైతులు భయపడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి గురువుబెల్లి శ్రీనివాసరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, నాయకులు బద్రి రామారావు, కోవిలాపు చంద్రశేఖర్, అత్తులూరి రవికాంత్, కూన రామకృష్ణ, కృష్ణారావు, హేమంత్, ప్రసాద్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


