జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికం
శ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్ ఆస్పత్రి జిల్లాకే తలమానికమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జెమ్స్‌లో యుగ్మా 25వ వార్షికో త్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల్లో భాగంగా కొన్ని కేసులను జెమ్స్‌కు రిఫర్ చేయడం, వారు త్వరగా కోలుకోవ డం శుభపరిణామన్నారు. జెమ్స్‌లో వైద్యం బాగుందని, పేద ప్రజలకు మరిన్ని సేవలందివ్వాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ.. అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో తాను కిమ్స్‌లోనే చికిత్స చేసుకున్నానని వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.


