బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు ప్రమాదాల కేసుల్లో బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం చెల్లించా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, స్థానిక న్యాయ సేవా సదన్ కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో యాక్సిడెంట్ కేసుల్లో బాధితులపై గురువారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుల క్లెయిమ్‌లను త్వ రితగతిన చెల్లించుటకు మార్గాలను గురించి విశ్లేషించి సమీక్షించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో బాధితుడికి సాయం చేయకపోవడం, నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిపోవడం సరికాదన్నారు. అలాంటి వారిని విడవరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూ టీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్.ఈశ్వరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ డీఎం నాగేంద్ర ప్రసాద్, ట్రాఫిక్ పోలీసు సీఐ వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.


