ప్రాణవాయువు నిలిపివేశారు
● నరసన్నపేట ఆస్పత్రిలో మూలకు చేరిన ఆక్సిజన్ ప్లాంట్
నరసన్నపేట: నరసన్నపేటలోని ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మూలకు చేరింది. రోగులకు ప్రయోజనకరంగా ఉంటూ వారి ప్రాణాలను కాపాడుతుందనే సదుద్దేశంతో గత ప్రభుత్వ కా లంలో రూ. 60 లక్షలు వెచ్చించి ఈ ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించారు. కోవిడ్ లాంటి మహమ్మారి మరోసారి వస్తే రోగులకు ఆక్సిజన్ సమస్యలు ఉత్పన్నం కాకూడదనే భావంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను అప్పట్లో నిర్మించింది. వార్డుల్లో కూడా ప్రత్యేక పైప్ లైన్లు వేశారు. ప్రభుత్వం మారడంతో ఈ ప్లాంట్ నిర్వహణను పూర్తిగా అధికారులు వదిలేశారు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్లను అవసరం రీత్యా ఆస్పత్రి వర్గాలు కొంటున్నాయి. దీంతో అదనపు ఖర్చుగా మారుతోంది. నరసన్నపేటలో ఆక్సిజన్ ప్లాంట్‌లో కంప్రెషర్లు మరమ్మతులకు గురి కావడంతోనే ఇది మూల పడిందని తెలుస్తోంది.
ఆస్పత్రిలో మూలకు చేరిన ఆక్సిజన్ ప్లాంట్


