కష్టాలు.. నష్టాలు
రైతన్నపై ముప్పేట దాడి
అదనపు డిమాండ్
మిల్లర్లు 84 కేజీలు అడుగున్నారు. అదనంగా ఇవ్వక పో తే ధాన్యం అన్‌లోడ్ చేయడం లేదు. బాగా నష్టపోతున్నాం. అధికారులకు తెలియచేసినా చర్యలు తీసుకోవడం లేదు. ట్రక్‌షీట్ కోసం కూడా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.
– పాగోటి గోవిందరావు, కంబకాయ రైతు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
అన్నదాతకు అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాల హెచ్చరికలు, మరోవైపు విక్రయాలకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు వెరసి రైతులు నష్టపోతున్నారు. ప్రస్తు తం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా ఉన్నాయి. వాస్తవానికి కొనుగోళ్లకు ముందే రైతులకు గోనె సంచులు సరఫరా చేయాలి. ఒకవేళ ప్రభుత్వం సరఫరా చేయకపోతే గోనె సంచీకి ఇంత ఇస్తామని లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ, జిల్లాలో ఇంతవరకు గోనె సంచెలపై స్పష్టతే ఇవ్వలేదు. దీంతో జిల్లాలో ఏ ఒక్క రైతుకు గోనె సంచులు అందని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఉన్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది మాత్రం గోనె సంచి సమర్పించుకుంటే ఒక్కో దానికి రూ. 9.58పైసలు ఇస్తామని చెబుతున్నారు. కానీ ఆ ధరకు గోనె సంచులు దొరికే పరిస్థితి లేదు. ప్యాక్ చేస్తే మిల్లు వరకై నా భద్రంగా ఉండే సంచులు కావాలంటే మార్కెట్‌లో రూ.16 ఽఅవుతుంది. అంటే ఒక్కో గోనె సంచిపై రూ.6.50వరకు అదనపు భారం పడుతోంది.
నత్తను మరిపిస్తున్న కొనుగోళ్లు
ఖరీఫ్ పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాల హెచ్చరికలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో 50 శాతానికి పైగా కోతలు అయిపోయాయి. ఇప్పుడా ధాన్యమంతా రోడ్లుపైన, కళ్లా ల్లోను, పొలాల్లోనూ ఉంది. వర్షాలు పడితే రైతులకు కన్నీళ్లే. జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుందే తప్ప యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదు. కనీసం మిల్లుల నుంచి బ్యాంకు గ్యారెంటీలే ఇంతవరకు తీసుకోలేకపోయింది. 264 మిల్లులకు గాను 82 మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చా యి. మిగతా 182మంది బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వ లేదు. దీంతో రైతుకు దళారే దిక్కుగా మారాడు.
టార్పాలిన్లు ఇవ్వని దుస్థితి
వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో పండిన పంటను రైతు భద్రంగా దాచుకోవడానికి ప్రభుత్వం టార్పాలిన్లు ఇవ్వాలి. కూటమి ప్రభు త్వం ఈ విషయాన్ని కూడా మరిచిపోయింది. అసలు టార్పాలిన్లు ప్రొక్యూర్ చేసిందో లేదో కూడా తెలియదు. వీటి కొనుగోలు కూడా రైతులకు అదనపు భారంగా మారనుంది.
అదనపు దోపిడీ
మిల్లుల వద్ద అదనపు దోపిడీ జరుగుతోంది. అసలే ట్యాగ్ చేసిన వాహనాలు అందుబాటులో ఉండకపోవడంతో సొంత ఖర్చులతో వాహనాలను పెట్టు కుని ట్యాగ్ చేసిన మిల్లులకు రైతులు ధాన్యం తరలిస్తున్నారు. అక్కడ గంటలు, రోజుల తరబడి అన్‌లోడ్ చేయడం లేదు. ఎంత ఆలస్యం జరిగితే అంత అదనపు ట్రాన్స్‌పోర్టు చార్జీ రైతులపై పడుతోంది. ఇదే నష్టం అనుకుంటే మిల్లుల వద్ద 80 కిలోల బస్తాకు అదనంగా 4నుంచి 6కిలోలు అడుగుతున్నారు. ధాన్యం తడిగా ఉన్నాయని, క్వాలిటీ లేదని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే ఆ రైతులకు సంబంధించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లే దు. దాని వల్ల కూడా ట్రాన్స్‌పోర్టు చార్జీ పెరిగిపోతోంది.
గోనె సంచులు ఇవ్వని ప్రభుత్వం
కనీసం టార్పాలిన్లు సమకూర్చని దుస్థితి
సొంతంగా కొనుగోలు చేసుకోవడంతో రైతులకు తప్పని భారం
అందుబాటులో ఉండని జియో ట్యాగ్ వాహనాలు
మిల్లుల వద్ద అదనపు దోపిడీ
కష్టాలు.. నష్టాలు
కష్టాలు.. నష్టాలు


