రాజ్యాంగ స్ఫూర్తితోనే వైఎస్సార్ సీపీ పాలన
● ఇప్పుడు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం తప్ప భారత రాజ్యాంగం లేదు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బడుగు బలహీన వర్గాల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితోనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పనిచేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కంటే అ త్యంత బలమైనది భారత రాజ్యాంగమని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడు తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక భారత రాజ్యాంగం అమలుకావడం లేదని రె డ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వైఎస్సార్‌సీపీ హయాంలో పాలన జరిగిందని, పేదరికం, వివక్ష, వంటి సమస్య లు రాజ్యాంగం మార్గదర్శకత్వంతోనే అధిగమించారన్నారు. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపైనా దౌర్జన్యాలు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ పాలనంతా భ్రష్టు పట్టించారన్నారు. ఇప్పటిౖకైనా కళ్లు తెరిచి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుని సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొన్నాడ రుషి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ పాలనంతా రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో విజయవాడలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ పార్కు నిర్వ హణ గాలికొదిలేసి, ఉద్యోగులకి జీతాల్వికుండా నాశనం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా చేస్తే దళిత జాతి చూస్తూ ఊరుకోదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డా రు. దళితుల ఓట్లు కావాలే తప్ప దళితుల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకి అవసరం లేదన్నారు. కా ర్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కళింగవైశ్యకుల రాష్ట్ర అ ధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ వెలమకు ల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, కాళింగకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళి, కూరాకుల, పొందర కుల రాష్ట్ర అధ్యక్షులు రాజాపు అప్పన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు, కార్యవర్గసభ్యులు గొండు కృష్ణమూర్తి, గ్రీవెన్స్‌సెల్ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సనపల నారాయణరావు, ఎస్సీ విభాగం నాయకులు యజ్జల గురుమూర్తి, నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.


