దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
● అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
● రామేశ్వరంలో ఘటన
● మరో నలుగురికి గాయాలు
● అందరూ పలాస వాసులే
పలాస: అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన పలాస మండలం పెదంచల, వీరరామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో నలుగురు భక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గరలో రామచంద్రపురం వద్ద గల మెడికల్ కళాశాల పక్కన జరిగింది. ఈ సంఘటన తెలియడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వారం రోజుల కిందట పలాస మండలం పెదంచల నుంచి ఇల్లాకుల నవీన్, వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన పైడి సాయి, గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మి నేని గణేష్‌లు అయ్యప్ప మాలలో భాగంగా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి ఎర్టిగా న్యూమోడల్ కార్‌లో బయల్దేరారు. మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుండగా రామేశ్వరం వద్ద వీరి కారు ఒక లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. అందులో ఉన్న వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన పైడి సాయి(25), పెదంచల గ్రామానికి చెందిన ఇల్లాకుల నవీన్(27) అక్కడికక్కడే మృతి చెందారు. వీరరామచంద్రపురానికి చెందిన గుంట రాజు, పై డి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశ్ తీవ్రగా యాలపాలయ్యారు. అక్కడి వారు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు, గ్రామస్తులు రామేశ్వరం బయల్దేరి వెళ్లారు. చనిపోయిన వారిలో ఇల్లాకుల నవీన్ తండ్రి తారకేశ్వరరావు ఎప్పుడో మృతి చెందగా తల్లి ఆశ వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..


