విలువలతో కూడిన విద్య అవసరం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విద్యార్థులతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన సమావేశమయ్యారు. ఆమదాలవలస జెడ్పీహెచ్ స్కూల్ కొర్లకోట నుంచి కిల్లి సంధ్య, కాగితాపల్లి నుంచి సురవరపు ఝాన్సీ, కొత్త స్నా నం నుంచి కె.స్నేహ, శ్రీముఖలింగం నుంచి ఆర్. భాగ్యశ్రీ, రొంపివలస నుంచి ఆర్.అభినయ్, ఎల్.ఎన్.పేట నుంచి ఎన్.వర్ష, 10వ తరగతి చదువుతున్న వారిలో ఎం.హారిక, పైడిబీమవరం, ఆర్.వెన్నెల, ఏపీఎంఎస్ సోంపేట, తామాడ హనీ, గరుడభద్ర, అలాగే 9వ తరగతి విద్యార్థులు, వి.ఢిల్లీశ్వరి, ఎంజేపీఏపీ స్కూల్ హయాతినగరం, బి.అనూష, గార, జెడ్పీ హైస్కూల్, ఎన్. జాహ్నవి, కురుడు, కొత్త బొమ్మాళి, ఎన్.జ్ఞానేశ్వరి జెడ్పీ హైస్కూల్ ఆకాశలక్కవరంతో పాటు వారి తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. నిరంతరం కృషి చేస్తే చక్కటి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. తన విద్యాభ్యాసం నుంచి కలెక్టర్ అయ్యే వరకు ప్రయాణాన్ని వారితో పంచుకున్నారు. సెల్‌ఫోన్ బారి నుంచి తల్లిదండ్రులే రక్షించాలని సూచించారు. స్కూళ్ల గురించి ఆరా తీస్తూ గరుడభద్ర జెడ్పీ హైస్కూల్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.


