మూడు చక్రాలే మృత్యువాయె..
● ట్రైసైకిల్ ప్రమాదంలో దివ్యాంగుడు మృతి
పలాస : మందస మండలం కొర్రాయి గేటు సమీపంలో మూడు చక్రాల వాహనం ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో దివ్యాంగుడు మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం వీరగున్నమ్మపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఎర్ర సింహాచలం (43) తన ట్రైసైకిల్‌పై కొర్రాయి గేటు వైపు వెళ్తుండగా వైటీసీ వద్ద ఎగుడు మలుపు వద్ద బోల్తాపడ్డాడు. అదే బండి కింద చిక్కుకొని దుర్మరణం పాలయ్యాడు. సింహాచలంకు భార్యాపిల్లలు ఉన్నారు. మందస ఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


