పేద విద్యార్థులపై ఎందుకంత కక్ష?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రధానాంశాలైన పేదలకు విద్య, వైద్యం సక్రమంగా అందించగలిగి ప్రభుత్వానిదే సుపరిపాలనవుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.42వేల కోట్లు, వసతి దీవెన కింద రూ.2వేల కోట్లు బకాయిపడ్డారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగునంగా హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలు రూ.3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తామని చెప్పి యువతను మోసగించారన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ కమిటీ వేయాలన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీఇవ్వకపోవడం అన్యాయమన్నారు. మద్దతు ధర రూ.1890 ప్రకటించినా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది 91లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని దాంట్లో 6.50లోల మెట్రిక్ టన్నులు ప్రభుత్వమే కొనాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తోందన్నారు. రాజధాని అమరావతి, తెలుగుతమ్ముళ్లు జేబుల నింపడంలో ఉన్న శ్రద్ధ ఇతర అంశాలపై లేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన సనపల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


