నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ
నరసన్నపేట: రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కృష్ణదాస్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
కమిటీలు నియమించండి
వైఎస్సార్‌సీపీకి చెందిన నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలన్నీ పూర్తి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ నాటికి పార్టీ ప్రధాన కమిటీతోపాటు అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి చేసి, పార్టీకి సమాచారం అందించాలన్నారు. కమిటీ డిజిటలైజేషన్ ప్రక్రి య కూడా పూర్తిచేయాలన్నారు. సంక్రాంతి నాటికి ప్రతి కమిటీ సభ్యునికి పార్టీ అధిష్టానం గుర్తింపు కార్డు ఇస్తుందని తెలిపారు. ప్రతి కమిటీ సభ్యునికి చెందిన రెండు ఫొటోలు, ఓటరు కార్డును జతచేయాలన్నారు. ఒకే పదవి ఇవ్వాలని, ఒక కమిటీలో పేరు వేస్తే ఆ పేరు మరో కమిటీలో వేయవద్దన్నారు. కమిటీ సభ్యుల వాట్సాప్ నంబర్ విధిగా పొందుపరచాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా సమన్వయకర్తలు దృష్టి పెట్టి పూర్తి చేయించాలని సూచించారు.
సీపీఐ నేతల గృహ నిర్బంధం
పలాస: ఆమదాలవలస సమీపంలోని వెన్నెలవలసలో థర్మల్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన చలో సరుబుజ్జిలి కార్యక్రమానికి వెళ్తున్న సీపీఐ కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా కార్యదర్శి బొత్స సంతోష్ కుమార్‌లను మంగళవారం ఉదయం 5గంటలకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇలాంటి చర్యలను ప్రజలు ఖండించాలని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు, ప్రజాసంఘాల ఐక్య వేదిక జిల్లా నాయకుడు పేడాడ కృష్ణారావు కోరారు.
ఆంధ్రా కబడ్డీ టీమ్ కెప్టెన్‌గా చంద్రలేఖ
శ్రీకాకుళం న్యూకాలనీ, టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్‌జూనియర్స్ బాలికల జట్టు కబడ్డీ టీమ్ కెప్టెన్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రీడాకారిణి చంద్రలేఖ ఎంపికయ్యారు. హరియాణాలోని సోనీపాట్ వేదికగా ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ సబ్‌జూనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను చంద్రలేఖకు అప్పగిస్తూ ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. చంద్రలేఖ జిల్లాలోని కోటబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఈమె ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులతో పాటు పాఠశాల హెచ్‌ఎం డి.గోవిందరావు, ఎస్‌ఎంసీ చైర్మన్ బోయిన వెంకటరమణ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ


