అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి

Nov 25 2025 6:05 PM | Updated on Nov 25 2025 6:05 PM

అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి

అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పీజీఆర్‌ఎస్‌లో 127 వినతులు స్వీకారం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను అధికారులంతా సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ప్రజల నుంచి 127 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతీ ఫిర్యాదునూ శ్రద్ధతో పరిశీలించి, ప్రజలకు సంతప్తి కలిగేవిధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ వారం ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ – 41, సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ – 16, వ్యవసాయ శాఖ – 15, పంచాయతీ రాజ్‌ – 7, ల్యాండ్‌ రికార్‌ుడ్స, ఏపీఈపీడీసీఎల్‌, హౌసింగ్‌ శాఖలకు సంబంధించి 5 చొప్పున ఫిర్యాదులు అందాయి. రూరల్‌ డవలప్‌మెంట్‌, గ్రామ వలంటీర్లు, సచివాలయాలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, సమగ్ర శిక్ష, సంక్షేమ శాఖలు, ఆరోగ్య శాఖ, ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ వంటి మొత్తం 26 వేర్వేరు శాఖల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

కొన్ని వినతులు పరిశీలిస్తే...

● ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీడీపీ కార్యకర్తలకు అప్పగించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆమదాలవలస నియోజవకర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు ఖండాపు గోవిందరావు, కొంచాడ రాము, గండెవలస పృథ్వీ తదితరులు ఉన్నారు.

● గనగళ్లవానిపేట పంచాయతీలోని నర్సయ్యపేట మత్స్యకార గ్రామంలో సముద్రానికి వెళ్లే దారిలో సోలార్‌ లైట్లు వేయాలని మైలపల్లి నర్సింగరావు కోరారు.

● టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో కేలీ, నాణ్యత లేని విత్తనాలు వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టాలకు సంబంధిత విత్తన కంపెనీలు, ప్రభుత్వం బాధ్యత వహించాలని రైతులు బీన డిల్లీరావు, బతకల సీతమ్మ, నక్క జోగారావు తదితరులు కోరారు.

● ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల్లో బీసీ జనాభాను జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి ఆ ప్రాప్తికి జన గణన చేయాలని, రాజ్యాధికారం, రిజర్వేషన్లు వంటివి ఈ కుల గణన ఆధారంగా ఉండాలని బీసీ సంఘ నాయకులు రాయలరాము, రాజమహంతి భానుచందర్‌, జీవీ రమణమూర్తి, సీహెచ్‌ రమేష్‌ తదితరులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement