33 ఏళ్లు.. 218 చోరీలు
● రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ దొంగ దున్న కృష్ణ అరెస్ట్ ● 60 కేసుల్లో శిక్ష పడగా.. ఏడుసార్లు జైలుకు...
శ్రీకాకుళం క్రైమ్ :
ముప్పై మూడేళ్లుగా దొంగతనాలే వృత్తిగా గడుపుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ దున్న కృష్ణ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇప్పటికే అతడికి 60 కేసుల్లో శిక్ష పడింది. ఏడుసార్లు జైలుకు వెళ్లాడు. అయినా మారకుండా మళ్లీ మళ్లీ దొంగతనాలే చే స్తుండడం గమనార్హం. మెళియాపుట్టి మండలం చాపరకు చెందిన కృష్ణ ఏకంగా 218 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీకాకుళం రూరల్, సీసీఎస్ పోలీసులకు పట్టుబడటంతో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. కృష్ణ వద్ద చోరీ సొత్తును కొనుగోలు చేసిన నగరంలోని గూనపాలేనికి చెందిన సయ్యిద్ రఫీ (39)ని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. చోరీ సొత్తును పశ్చిమబెంగాల్ సోనాసూర్‌కు చెందిన అనంత్సన్‌ఫుల్, తరుణ్‌మోండల్ ఇచ్చినట్లు కృష్ణ, రఫీలు విచారణలో తెలియజేయడంతో, వారిని అరెస్టు చేసి మిగిలిన సొత్తును రికవరీ చేయాల్సి ఉందన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కృష్ణ విశాఖలోని కంచరపాలెంలో చదువుకున్నాడు. వెల్డర్‌గా పనిచేస్తూ 1993లో సైకిల్ దొంగతనంతో ప్రస్థానం మొదలుపెట్టాడు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకోవడం, పగలంతా రెక్కీ చేయడం, రాత్రి చోరీకి పాల్పడడం అతడి ప్రత్యేకత. చోరీ సొ త్తుతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్న కృష్ణ తన కుటుంబం మొత్తాన్ని కోల్‌కతాకు మార్చేశా డు. అక్కడ ఖరీదైన భవంతి నిర్మించాడు. 2015 అక్టోబర్ 29న విజయవాడ సీసీఎస్ పోలీసులు కృష్ణను అరెస్టు చేసి 2.5 కిలోల బంగారం, 15 కిలోల వెండి స్వాధీనం చేసుకోగా, 2018లో విశాఖ పోలీ సులకు కృష్ణ పట్టుబడగా 1135గ్రాములబంగారం, 5.175 కిలోల వెండి, రూ.1.88 లక్షలు దొరికాయి.
2023లో విజయనగరంలో చోరీ కేసుల్లో జైలుకెళ్లిన దున్న కృష్ణను మన జిల్లాలో కేసులుండటంతో శ్రీకాకుళం రూరల్ పోలీసులు అక్కడకు వెళ్లి పీటీ వారెంట్‌పై అంపోలు జిల్లా జైలుకు తీసుకొచ్చారు. 2024 జనవరిలో బెయిల్ పొంది విడుదలవ్వడం, అనకాపల్లి పోలీసులు కాపుకాయడాన్ని పసిగట్టిన కృష్ణ గోడపైనుంచి దూకేయడం, కాళ్లు విరగడం, ఐదునెలలు విశ్రాంతి అనంతరం సెప్టెంబరు నుంచి మళ్లీ నేరబాట పట్టాడు.
పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సెల్‌ఫోన్, ఆధార్, ఇతర ఐడెంటిటీ కార్డులు కృష్ణ వాడడు. తనకు దగ్గరగా ఉండే అందరినీ తన నేరంలో భాగ స్తులను చేస్తాడు. ప్రస్తుతం 18 కేసుల్లో జిల్లాలోని పలువురు నగల వ్యాపారుల వద్ద చోరీ సొత్తును అ మ్మాడని, వారిపైనా చర్యలు త్వరలో తీసుకుంటా మని ఎస్పీ చెప్పారు. శ్రీకాకుళం రూరల్‌లో 14, రెండో పట్టణ పీఎస్‌లో 3, ఒకటో పట్టణ పీఎస్‌లో ఒక చోరీ చేశాడు. సెప్టెంబరు 10న ఎస్‌బీఐ స్టాఫ్ కాలనీలో వెండి పోవడంతో 13న రాజుల భవాని ఫిర్యాదు చేశారు. విశాఖ కంచరపాలెంలో డీసీ షీట్ కూడా ఉంది.
మన జిల్లాలో 18 కేసుల్లో 476 గ్రాముల బంగారం పోయినట్లు ఫిర్యాదుదారులు పేర్కొనగా వాస్తవంగా 362 గ్రాములే పోయిందని, 237 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అన్నారు. ఓ ఫిర్యాదుదారు 85 గ్రాముల బంగారం పోయిందని ఫిర్యాదు చేశారని, కానీ బిల్లులు లేకపోవడం, నింది తున్ని పట్టుకున్నాక ఆయా దుకాణాల్లో వెరిఫై చేశాక తప్పని తేలిందని ఎస్పీ చెప్పడం గమనార్హం. తప్పుడు ఫిర్యాదుదారులపై న్యాయపరంగా చర్య లు తీసుకుంటామని ఎస్పీ చెప్పడం కొసమెరుపు. వాస్తవానికి బహుమతులు, పాతకాలం బంగారాని కి బిల్లులు ఉండవు.
అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో డీఎస్పీ వివేకానంద, సీసీఎస్ సీఐ ఎస్.సూర్యచంద్రమౌళి, రూరల్ సీఐ పైడపునాయుడులు కేసు ను చాకచక్యంగా ఛేదించారని ఎస్పీ ప్రశంసించారు. ఎస్‌ఐలు రాము, రాజేష్, బలివాడ గణేష్, మధుసూదనరావు, హెచ్‌సీ శ్యామ్, కానిస్టేబుళ్లు విజయ్, భాస్కర్, మాధవ్, శ్రీను, హరీష్, ఆలీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
33 ఏళ్లు.. 218 చోరీలు


