గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రా ష్ట్రం గంజాం జిల్లా ఆర్.సువాని గ్రామానికి చెందిన బాబూజీ సుబుద్ధి, మిథెన్ బెహరాలు అనుమానా స్పదంగా కనిపించారు. తనిఖీ చేయగా ఏడు కేజీల గంజాయి గుర్తించా రు. గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు. గుంతకల్‌లో గంజాయి వ్యాపారం చేస్తున్న కర్ణాటక కు చెందిన వ్యక్తి తిప్పేస్వామికి గంజాయి అందజేయడానికి వీరు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై ఎం.ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.


