2.45 గంటలు నిలిచిపోయిన విశాఖ ఎక్స్‌ప్రెస్
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు 2.45 గంటల సమయం నిలిచిపోయింది. బోగీల్లో, ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.45 వరకు ఆగిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వివేక్ ఎక్స్ ప్రెస్ రైలు, ఈఎంయు రైలు, బెంగుళూరు స్పెషల్ రైలు పొందూరులో ఎక్కువ సమయం నిలపాల్సి వచ్చింది. ఎవరూ చైన్ లాగలేదని నిర్ధారించుకున్నాక, విజయనగరం నుంచి రైల్వే ఇంజినీరింగ్ సిబ్బంది వచ్చి సమస్యను గుర్తించి సరిచేయడంతో 4.45 గంటలు తర్వాత ట్రైన్ బయలు దేరింది.
కంచిలి: మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో తిష్టవేసిన అసౌకర్యాలను ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పీఎంజే బాబు, శ్రీకాకుళం జిల్లా గురుకులా ల సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి శుక్రవారం పరిశీలించారు. శాశ్వత ప్రాతిపదికన వసతి నిర్మా ణం కోసం కంచిలి గురుకుల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకొన్నారు. దీంతోపాటు అర్ధంతరంగా ఆగిపోయిన అదనపు తరగతి గదులు నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. పిల్లల భోజనాలు పర్యవేక్షించి, పిల్లలతో కలిసి భోజనాలు చేశారు. వీరితోపాటు ఏపిఇడబ్ల్యూఐడిసి ఏఈ పి.సునీల్ కూడా పాల్గొన్నారు.
2.45 గంటలు నిలిచిపోయిన విశాఖ ఎక్స్‌ప్రెస్


