వలస కూలీ అదృశ్యం
కంచిలి: కొత్తంపురం గ్రామానికి చెందిన వలస కూలీ మల్లార్పు సోమయ్య(60) అదృశ్యమయ్యాడు. రెండు నెలల క్రితం బోర్లు వేసే ఫైలింగ్ ఆపరేటర్‌గా పనిచేసేందుకు సోమయ్య కేరళ వెళ్లాడు. పను లు పూర్తి కావడంతో అక్కడి నుంచి ఈ 15న రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. విజయవాడకు ఆదివారం సాయంత్రం 7 గంటల కు చేరాడు. అప్పటి వరకు భార్య గంగమ్మతో ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నాడు. సోమవారం ఉద యం 10 గంటలకు సోంపేటలో రైలు దిగాల్సి ఉంది. కానీ రాలేదు. వెంటనే ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. రైల్వేస్టేషన్‌లో అదృశ్యమయ్యాడా లేక మరేదైనా సమస్యలో చిక్కుకు న్నాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసుల్ని ఆశ్రయించగా.. విజయవాడ లో అదృశ్యమయ్యాడు కనుక అక్కడే ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు బాధితుని భార్య శుక్రవా రం విలేకరుల ఎదుట వాపోయింది.
కవిటి: మాణిక్యపురంలో విద్యుత్ శాఖకు చెంది న రెండు ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి వేళ విద్యుత్ లైన్ బ్రేక్ చేసి ట్రాన్స్‌ఫార్మర్లను నేలకూల్చి అందులో ఉన్న ఖరీదైన కాయిల్స్‌ను దుండగులు పట్టుకుపోవడం గమనార్హం. కాగా, విద్యుత్‌శాఖ తరఫున పోలీసుల కు ఎటవంటి ఫిర్యాదు అందలేదు.
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షలకు హాజరుకాబోయే వయసు చాలని విద్యార్థులకు కండోనేషన్ ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం తెలిపారు. విద్యార్థి వయసు 2025 ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండకపోతే ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో తమ స్కూల్ లాగిన్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేసి ఈ నెల 30లోగా ఫీజు చెల్లించాలన్నారు.


