‘అంగన్‌వాడీల విలీనం ఆపాలి’
హిరమండలం: అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. హిరమండలంలో యూనియన్ సమావేశం నిర్వహించారు. విలీనం పేరుతో అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ ని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమి క విద్యార్థులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేంద్రాలను బలోపేతం చేయాల్సి న ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూ ల్ బలోపేతం చేయాలంటే 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలను కేంద్రాల్లో నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వంద నం అమలుచేయాలన్నారు. డిసెంబరు 31 నుంచి జనవరి 4 వరకూ విశాఖలో నిర్వహిస్తున్న సీఐటీ యూ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అద్యక్షుడు సిర్ల ప్రసాద్ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యర్శులు కె.కళ్యాణి, డి.సుదర్శనం, కొత్తూరు ప్రాజెక్టు యూనియన్ నాయకులు కె.లక్ష్మి, కేవీ హేమలత, ఎస్.లక్ష్మి, సరోజినీ తదితరులు పాల్గొన్నారు.


