హైవేపై కారు దగ్ధం
రణస్థలం: పైడిభీమవరం సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. అప్రమత్తమైన కారు యజమాని జి.గౌరినాయుడు వెంటనే బయటకు వచ్చేశారు. ఇంజన్ ఓవర్ హీట్ కావడంతో కారు ముందు భా గంలో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. స్థానికులు రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందర్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నారు. ముందు భాగం పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
బూర్జ : పెద్దపేట పంచాయతీ మదనాపురం గ్రామానికి చెందిన రైతు నెక్కింటి నాగేశ్వరరావు చెరుకు తోట కాలిపోయింది. బొమ్మిక గ్రామ రోడ్డులో ఉన్న ఐదు ఎకరాల తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాలకొండ అగ్ని మాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే ఎకరా పంట కాలిపోయింది. పక్కన ఉన్న పొలంలో చెత్తకు అగ్గి పెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్షా యాభై వేలు నష్టంవాటిల్లినట్లు అంచనా వేశామని పాలకొండ అగ్నిమాపక కేంద్రం ఎస్సై సర్వేశ్వరరావు తెలిపారు.


