ఎరుపెక్కిన ఉద్దానం
● మెట్టూరు జోగారావుకు కడసారి వీడ్కోలు
● రెండు రోజుల నిరీక్షణ తర్వాత స్వగ్రామానికి చేరిన పార్థివ దేహం
● విప్లవ వీరుడి చివరి చూపుకోసం
భారీగా వచ్చిన ఉద్దానం ప్రజలు
● పోలీసు నిఘా మధ్య అంత్యక్రియలు
జోగారావు కనిపించాడు. నినాదాలు చేయకుండా, పిడికిలి బిగించకుండా, తుపాకీ చేతపట్టకుండా ఉద్దానానికి ముప్పై ఏడేళ్ల తర్వాత మళ్లీ కనిపించాడు. ఆఖరి చూపు కోసం బాతుపురం తరలివచ్చిన వారికి చివరి సారి మౌనంగా, నిశ్శబ్దంగా, నిర్జీవంగా కనిపించాడు. రోదనలు, నినాదాలు కలిపి ఊరంతా ఉద్విగ్నమై ఉండగా పోలీసు డేగ కళ్ల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. 37 ఏళ్లు అడవికి అంకితమైపోయి శివసాగర్ సముద్ర తీరం చెంత బూడిదగా మారిపోయాడు.
వజ్రపుకొత్తూరు రూరల్: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంక ర్ అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వస్థలంలో జరిగాయి. రెండు రోజుల నిరీక్షణ తర్వాత శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన మృతదేహం బాతుపురం గ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు భోరున విలపించారు. కామ్రేడ్ శంకర్ మృతదేహం బాతుపురం చేరిందని తెలిసి కడసారి చూపు కోసం ఇత ర జిల్లాలలో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్ర జా సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. దీంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ప్రజా సంఘ నాయకులు విప్లవ జెండాను మృతదేహంపై వేసి విప్లవ నినాదాలు చేశారు. అనంతరం గ్రామ, కుటుంబ సంప్రదాయం ప్రకారం జోగారావు అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా విప్లవ జోహా ర్లతో అంతిమ యాత్ర చేపడుతుండగా కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు అడ్డు పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మీ పోలీసులే జోగారావును పొట్టన పెట్టుకు న్నారు. ఇప్పుడు ప్రశాంతంగా దహనసంస్కారాల కువెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.
అడుగడుగునా పోలీసు ఆంక్షలు
కామ్రేడ్ మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అంత్యక్రియలు పోలీసు ఆంక్షల మధ్యనే జరిగాయి. ర్యాలీలు చేయవద్దు, జెండాలు పట్టుకోవద్దు, విప్లవ నినాదాలు చేయవద్దు, ఎలాంటి కళాప్రదర్శనలు చేయకూడదంటూ ఆంక్షలు విధించారు. అంతిమయాత్రను పోలీసులు అడ్డుకోవ డంపై స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సంఘ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సీఐ వెన క్కు తగ్గి ఎలాంటి ర్యాలీలు చేయకుండా మీ గ్రామ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసుకోవాలని సూచించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. తాము ఎలాంటి ర్యాలీలు చేపట్టడం లేదని, ఎవరు చనిపోయినా ప్రజలు ఇలానే వ స్తారని చెప్పడంతో అంతిమయాత్రకు సీఐ అను మతి ఇచ్చారు. దీంతో ఉద్దాన ప్రజల నడుమ అంతియ యాత్ర ప్రశాంతంగా ముగిసింది. అక్కుపల్లి శివసాగర్ పరిసర ప్రాంతంలో శంకర్ దహన సంస్కారాలు చేపట్టారు. సోదరుడు మధుసూదన్ తలకొరివి పెట్టారు.
ఉద్యమాలు ఆపలేరు
బూటకపు ఎన్‌కౌంటర్లతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు అంజమ్మక్క, తాండ్ర ప్రకాష్, వంకల మాధవరావు, దున్న గోవిందరావు, తామాడ సన్యాసిరావు, అరుణ, కృష్ణవేణి, కుసుమ, నాగవేణి, బత్తిరి దానేస్, వీరస్వామి, పుచ్చ దుర్యోధన, బత్తిన ధర్మారావు, లక్ష్మణ్, వైకుంఠరావు, జో గారావు, గణపతి, నీలకంఠ, గీతారాణి తదితరు లు ఉన్నారు.
బాతుపురం కన్నీటి సంద్రం
ఎరుపెక్కిన ఉద్దానం
ఎరుపెక్కిన ఉద్దానం


