ఆపేదే లేదు..!
రామన్నకు సొసైటీ 1980లో కేటాయించగా 2018 బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న టంకాల అర్జున్ రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో అర్జున్ పాలక వర్గం అనుమతి తీసుకోలేదు. రిజిస్ట్రేషన్ చెల్లదని ప్రస్తుతం అధ్యక్షుని హోదాలో ఉన్న చింతు రామారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిజిస్ట్రార్ కార్యాలయానికి లేఖ రాశారు. సమాచారం రామన్నకు కూడా తెలియజేశారు.
అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకు లు పావులు కదిపి రూ.కోట్లు విలువ చేసే ఈ స్థలంపై కన్నేశారు. సబ్ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి చేసి స్థలాన్ని విజయనగరానికి చెందిన బిల్డర్‌కు రామన్నతో మార్ట్‌గేజ్ చేయించారు. దీంతో ఆయన పనులు చేపడుతున్నారని సొసైటీ పాలక వర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆపేదే లేదు..!


