పెట్టుబడులన్నీ బూటకమే
ఆమదాలవలస: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించామని చెబుతున్న సీఐఐ సదస్సు –2025 లో ప్రకటించిన పెట్టుబడులు, ఎంవోయూలు, ఉద్యోగాల గణాంకాలన్నీ బూటకమేనని వైఎస్సార్ సీపీ యువనేత తమ్మినేని చిరంజీవినాగ్ అన్నారు. గురువారం ఆమదాలవలసలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం 613 సంత కాలు జరిగినట్లు చెబుతోందని, వాటిలో ఎన్ని పూర్తిగా కొత్త పెట్టుబడులు అనే విషయాన్ని తేటతెల్లం చేయాలన్నారు.గత ప్రభుత్వ కాలంలో పూర్తయిన పాత ఒప్పందాల పునరుద్ధరణను చంద్రబా బు సర్కార్ తమ గొప్పగా చెప్పుకోవడం తగదన్నా రు. మొత్తం రూ.13.25 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయనడాన్ని తప్పుపట్టారు. భారీ పెట్టుబడుల కు అవసరమైన ప్రాజెక్ట్ వివరాలు, లొకేషన్, భూముల కేటాయింపు, ఆమోదాలు ప్రజలకు తెలియజేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పెట్టుబడి అంటే పేజీ మీద ఉన్న ఎంవోయూ కాదని, అది నేల మీద కనిపించాలన్నారు. నూతన ఒప్పందాలలో భాగంగా ఏర్పాటయ్యే పరి శ్రమలు ద్వారా 1.63 లక్షల ఉద్యోగాలు వస్తాయంటూ చేస్తున్న ప్రచారం ఉత్తిదేనన్నారు. ప్రకటనలు కాకుండా ప్రాజెక్టుల జాబితా,గ్రౌండింగ్ వివరాలు, పెట్టుబడుల ఆధారాలు, ఉద్యోగాలు కల్పన వంటి వి ప్రజలకు చూపించాలన్నారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాతప ట్నం అసెంబ్లీ నియోజకవర్గ చేతివృత్తుల విభాగం అధ్యక్షుడిగా గుంటు వీరభద్రుడు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం గురువారం ప్రకటన విడుదల చేసింది.


