పఠనాసక్తి పెరిగినప్పుడే పుస్తకాలకు విలువ
శ్రీకాకుళం కల్చరల్ : ప్రతి ఒక్కరిలో రీడింగ్ రివల్యూషన్ వచ్చినప్పుడే పుస్తకం విలువ పెరుగుతుందని సిక్కోలు పుస్తక మహోత్సవం చైర్మన్ డాక్టర్ కె.సుధీర్ అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ హైస్కూల్ మైదానంలో 10రోజులు గా జరుగుతున్న సిక్కోలు పుస్తక మహోత్సవం ముగింపు సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక మహోత్సవం సభ్యులు అట్టాడ అప్పలనాయుడు, కన్వీనర్ కె.శ్రీనివా స్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, సాహిత్య కమిటీ స భ్యులు బాడాన శ్యామలరావు, కల్చరల్ కమిటీ సభ్యులు సుధాకర్, జె.వి.వి.రాష్ట్ర అధ్యక్షుడు గొంటి గిరిధర్, లక్ష్మయ్యలు మాట్లాడుతూ తొలిసారి ఏర్పాటు
చేసిన పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందన్నారు. అనంతరం చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
అంతకుముందు నెట్టెం రమణ అధ్యక్షతన చర్చాగోష్టి నిర్వహించారు. విశ్రాంత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న, రచయత బండి సత్యనారా యణ, రచయతలు శ్రీనివాసరావు, కె.ఉదయకిరణ్, ఎన్.రమణలు ప్రసంగించారు. అనంత రం రచయత్రి పత్తి సుమతి రచించిన డౌన్ డౌన్ డార్వీన్ అట పుస్తకం ఆవిష్కరణ, ఎల్.ఎన్.కొల్లి రచించిన ఎకోస్–ఎంబర్స్ పుస్తకావిష్కరణ జరిగింది. మొయిదశ్రీనివాసరావు రచించిన కరవాక పుస్తకాన్ని పరిచయం చేశారు.
పఠనాసక్తి పెరిగినప్పుడే పుస్తకాలకు విలువ


