భూతగాదాలో ఇద్దరికి గాయాలు
సారవకోట: గుమ్మపాడు పంచాయతీ అగదల గ్రా మంలో గురువారం భూ తగదాలో ఇరువర్గాలకు చెందిన ఇద్దరు గాయాలపాలైయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బమ్మిడి జయరాంకు చెందిన జిరాయితీ భూమిలో కొంత భాగాన్ని హను మంతు రామకృష్ణ అనే వ్యక్తి కొన్నాళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ నెల 17న 70 సెంట్లలో వరి కోత చేపట్టాడు. అదే ప్రాంతంలో బమ్మిడి జయరాం కూడా ఈ నెల 19న 70 సెంట్లలో వరి కోత చేపట్టా డు. గురువారం ఇద్దరూ ఒకే సారి మిగిలిన వరి పంట కోత చేపట్టేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన గొడవకు దిగడంతో జయరాం, నాగభూషణలు గాయపడ్డారు. జయరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమంతు రామకృష్ణ, జలజాక్షి, బలగ నాగభూషణలపై కేసు నమోదు చేయగా.. నాగభూషణ ఇచ్చిన ఫిర్యాదుపై బమ్మిడి జయరాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అనిల్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను బుడితి సీహెచ్‌సీ, నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించి అనంతరం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కాగా, అగదలలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి వరి పొలంలో ఉన్న బమ్మిడి జయరాంను ఎస్‌ఐ తన వాహనంలో బుడితి సీహెచ్‌సీలో చేర్పించి చికిత్స అందించారు.
భూతగాదాలో ఇద్దరికి గాయాలు


