శ్రీకాకుళం
పెట్టింది తిను..టెక్కలి జిల్లా ఆస్పత్రిలో మెనూ అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షించడం లేదు. –8లో
● వేడుకగా ఏక్తా దివస్
పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ‘రాష్ట్రీ య ఏక్తాదివస్’ వేడుకగా జరిగింది. ఏటా అక్టోబరు 21 నుంచి 31 వరకు జరిగే ఈ స్మారకోత్సవాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు ముగిస్తారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ముందుగా విద్యార్థినీ విద్యార్థులకు, జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి వ్యాసరచన, డిబేట్‌లలో పాల్గొన్న పోలీసులకు బహు మతులు, ప్రశంసాపత్రా లు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి, ప్రేరణగా నిలవాలని, గతంలో పోలీసులు ఫోర్స్ చూపించేవారని, ఇప్పుడు సర్వీస్ చూపిస్తున్నారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలు దేశభక్తి వైపు అందరినీ నడిపిస్తున్నాయని, చనిపోయిన పోలీ సుల కుటుంబాలకు అండగా నిలవడం, పోలీసు సేవల గురించి ప్రజలకు తెలియజెప్పడమే ఈ స్మారకోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డే అండ్‌నైట్ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి అమరవీరులకు సంఘీభావం తెలిపారు. – శ్రీకాకుళం క్రైమ్
శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ ఊరూవాడా ఏక్తా దివస్ జరుపుకున్నాయి. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో విద్యార్థులు ఇలా నివాళులర్పించారు. – కొత్తూరు
శ్రీకాకుళం


