‘మెస్ చార్జీలు పెంచాలి’
పలాస: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలను పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఎం.వినోద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పలాసలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచలేదని, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీ లు కూడా ప్రభుత్వం పెంచాలని కోరారు. హైస్కూల్ విద్యార్థులకు రూ.1400లు, కళాశాల విద్యార్థులకు రూ.1600లు మెస్ చార్జీలు పెంచాలని కోరారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టళ్లలో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని, అస్వస్థతకు గురువుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి సరైన వైద్యం అందివ్వాలని కోరారు.


