హామీలన్నీ డాబేనా..?
●బాబూ..
● కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
చంద్రబాబు జిల్లాకొచ్చి ఏడాది పూర్తి
● ఈదుపురంలో ఉచిత గ్యాస్
సిలిండర్ పథకం ప్రారంభం
● అదే రోజున జిల్లా కేంద్రంలో సమీక్ష
● తొలి పర్యటనలోఅనేక హామీలు
● ఏడాదైనా అమలుకు
నోచుకోని పరిస్థితులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని మరోసారి తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి జిల్లాకు వచ్చి ఏడాదైంది. గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన ఇచ్ఛాపురం మండ లం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. సినీ ఫక్కీలో యాక్షన్, ట్రిక్‌లతో హడావుడి చేశారు. వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎన్నో హామీలు ఇచ్చారు. అంతటితో ఆగలేదు. జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మరికొన్ని హామీలు ఇచ్చారు. ఏడాదైనా అవి అమలు కాలేదు.
ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామ ని చెబుతూ పథకాన్ని ఈదుపురంలో ప్రారంభించారు. గ్యాస్ భారం తగ్గుతుందని, మహిళలకు కట్టెల కష్టాలు తీరుతాయని తెగ చెప్పారు. ఏటా తెలుపురేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు తప్పనిసరిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉచిత సిలిండర్లకు ముందుగా డబ్బులు చెల్లిస్తే, 48 గంటల్లో లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు నగదు చెల్లించడం జరుగుతుందన్నారు. త్వరలో లబ్ధిదారుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వమే గ్యాస్ కంపెనీకి ఆ డబ్బును జమచేస్తుందని, అప్పుడు డబ్బు చెల్లించకుండా నేరుగా సిలిండర్‌ను తీసుకోవచ్చన్నారు. కానీ ఆ హామీ చంద్రబాబు మాటలకే పరిమితమైంది. పథకం అమలు సమయంలో ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన మిగతా రెండు సిలిండర్లు ఇంతవరకు ఇవ్వలేదు. వినియోగదారులు డబ్బులు చెల్లించుకోవడం తప్ప ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ కావడం లేదు.
బెల్టుషాపులు పెడితే సహించేది లేదని బెల్టు తీస్తానని హెచ్చరించారు. అధిక ధరలకు అమ్మినా, బెల్టు షాపులు పెట్టినా సంబంధిత షాపునకు మొదటిసారి భారీ జరిమానా వేస్తామని, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మా హయాంలో నాసిరకం మద్యం ఉండదని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక ఇస్తున్న ఏకై క ప్రభుత్వమని చెప్పుకున్నారు. చంద్రబాబు చెప్పినాక జిల్లాలో బెల్ట్‌షాపులు మరింత పెరిగిపోయాయి. సిండికేట్‌గా ఏర్పడిన టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. బెల్ట్‌షాపులే కాదు లీజు షాపులకు పర్మిట్ రూమ్‌లు కూడా ఇచ్చి మద్యం విక్రయాలకు మరింత ప్రోత్సాహం అందించారు. ఇక, ఉచిత ఇసుక కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జిల్లాలో ఉచిత ఇసుక మాటే లేదు. టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక ర్యాంపులు నిర్వహించి, ఏ స్థాయిలో దోచుకుంటున్నారో జిల్లా ప్రజలంతా చూస్తున్నారు. వర్షాకాలంలో నదుల్లో వరదలొస్తున్నా కూడా ఇసుక అక్రమ తవ్వకాలు ఆపడం లేదంటే ఉచిత ఇసుక పాలసీ ఏ రకంగా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్య హామీల సంగతులివి..
బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులు కోసం, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంతవరకు మంజూరు చేయలేదు.
బెంతొరియాల పేరుతో స్థానికత ధ్రువపత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వడం లేదు. కానీ,ఈ హామీ పేరుతో ఎమ్మెల్యే రెండు సార్లు సన్మానాలు మాత్రం చేయించుకున్నారు.
ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రెండింటిలో ఏదీ జరగడం లేదు.
అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తానన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు.
పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. చేసిందేమీ లేదు.
ముఖ్య హామీల సంగతులివి..
బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులు కోసం, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంతవరకు మంజూరు చేయలేదు.
బెంతొరియాల పేరుతో స్థానికత ఽధ్రువపత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వడం లేదు. కానీ,ఈ హామీ పేరుతో ఎమ్మెల్యే రెండు సార్లు సన్మానాలు మాత్రం చేయించుకున్నారు.
ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రెండింటిలో ఏదీ జరగడం లేదు.
అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తాను. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. చేసిందేమీ లేదు.


